కారు నెంబర్ కోసం ఏకంగా రూ.122 కోట్లు వెచ్చించాడు... కట్ చేస్తే గిన్నిస్ రికార్డ్ సొంతం అయింది!

మనలో కొంతమందికి ఫ్యాన్సీ నెంబర్లంటే( Fancy Numbers ) ఒకరకమైన పిచ్చి ఉంటుంది.దానికోసం ఎంత డబ్బు వెచ్చించైనా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతూ వుంటారు.

 Dubai Man Buys World Most Expensive Vip Number Plate P 7 Details, Viral Latest,n-TeluguStop.com

అదే బడా బాబులైతే తమకు నచ్చిన నెంబర్ కోసం కోట్లు ఖర్చుచేయడానికైనా వెనుకాడరు.ఈ క్రమంలో అలాంటి ఫ్యాన్సీ నెంబర్లకు వేలం పాట అనేది జరుగుతూ ఉంటుంది.

ఇక్కడే అలాంటి నెంబర్లకు అత్యధికమైన గిరాకీ ఏర్పడి ధర ఆకాశాన్నంటుతుంది.ఇపుడు అలాంటి ఓ విషయం గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం.

ఓ వ్యక్తి తనకు కావలసిన వీఐపీ నెంబర్ ప్లేట్ ‘P 7’ను సొంత చేసుకోవడం కోసం ఏకంగా రూ.122.6 కోట్లు ఖర్చు చేసాడంటే మీరు నమ్ముతారా? అవును.మీరు ఇక్కడ విన్నది అక్షరాల నిజం.

ఇంకేముంది కట్ చేస్తే, ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ప్లేట్‌ను విక్రయించిన వాడిగా గిన్నిస్ రికార్డ్( Guinness Record ) సృష్టించాడు.ఏప్రిల్ 8వ తేదీన దుబాయ్‌లో ( Dubai ) ఎమిరేట్స్ సంస్థ మోస్ట్ నోబుల్ నంబర్స్ చారిటీ వేలాన్ని నిర్వహించగా వన్ బిలియన్ మీల్స్ కూడా ఈ క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలిచింది.

ఈ ఈవెంట్‌లో భాగంగా ‘P 7’ కారు నెంబర్ ప్లేట్ కోసం 15 మిలియన్ వద్ద వేలం పాట మొదలైంది.

అయితే కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఈ బిడ్డింగ్ 30 మిలియన్ ని దాటేసింది.అప్పుడు టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు, యజమాని పావెల్ వాలెరివిచ్ డ్యూరోవ్ 35 మిలియన్ తో వేలం వేయగా అక్కడి నుంచి ఒక దశలో ఈ బిడ్డింగ్ ఆగిపోయింది.చివరికి ఈ బిడ్డింగ్ 55 మిలియన్ దిర్హామ్‌ల అంటే భారత కరెన్సీలో రూ.122.6 కోట్లు వద్ద ముగిసింది.ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.ఈ వేలం పాటలో అంత భారీ మొత్తానికి ఆ నెంబర్ ప్లేట్‌ని ఎవరు సొంతం చేసుకున్నారన్నది మాత్రం ఇంకా బయటపడలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube