కారు నెంబర్ కోసం ఏకంగా రూ.122 కోట్లు వెచ్చించాడు… కట్ చేస్తే గిన్నిస్ రికార్డ్ సొంతం అయింది!

మనలో కొంతమందికి ఫ్యాన్సీ నెంబర్లంటే( Fancy Numbers ) ఒకరకమైన పిచ్చి ఉంటుంది.

దానికోసం ఎంత డబ్బు వెచ్చించైనా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతూ వుంటారు.అదే బడా బాబులైతే తమకు నచ్చిన నెంబర్ కోసం కోట్లు ఖర్చుచేయడానికైనా వెనుకాడరు.

ఈ క్రమంలో అలాంటి ఫ్యాన్సీ నెంబర్లకు వేలం పాట అనేది జరుగుతూ ఉంటుంది.

ఇక్కడే అలాంటి నెంబర్లకు అత్యధికమైన గిరాకీ ఏర్పడి ధర ఆకాశాన్నంటుతుంది.ఇపుడు అలాంటి ఓ విషయం గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం.

"""/" / ఓ వ్యక్తి తనకు కావలసిన వీఐపీ నెంబర్ ప్లేట్ ‘P 7’ను సొంత చేసుకోవడం కోసం ఏకంగా రూ.

122.6 కోట్లు ఖర్చు చేసాడంటే మీరు నమ్ముతారా? అవును.

మీరు ఇక్కడ విన్నది అక్షరాల నిజం.ఇంకేముంది కట్ చేస్తే, ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ప్లేట్‌ను విక్రయించిన వాడిగా గిన్నిస్ రికార్డ్( Guinness Record ) సృష్టించాడు.

ఏప్రిల్ 8వ తేదీన దుబాయ్‌లో ( Dubai ) ఎమిరేట్స్ సంస్థ మోస్ట్ నోబుల్ నంబర్స్ చారిటీ వేలాన్ని నిర్వహించగా వన్ బిలియన్ మీల్స్ కూడా ఈ క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలిచింది.

ఈ ఈవెంట్‌లో భాగంగా ‘P 7’ కారు నెంబర్ ప్లేట్ కోసం 15 మిలియన్ వద్ద వేలం పాట మొదలైంది.

"""/" / అయితే కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఈ బిడ్డింగ్ 30 మిలియన్ ని దాటేసింది.

అప్పుడు టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు, యజమాని పావెల్ వాలెరివిచ్ డ్యూరోవ్ 35 మిలియన్ తో వేలం వేయగా అక్కడి నుంచి ఒక దశలో ఈ బిడ్డింగ్ ఆగిపోయింది.

చివరికి ఈ బిడ్డింగ్ 55 మిలియన్ దిర్హామ్‌ల అంటే భారత కరెన్సీలో రూ.

122.6 కోట్లు వద్ద ముగిసింది.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.ఈ వేలం పాటలో అంత భారీ మొత్తానికి ఆ నెంబర్ ప్లేట్‌ని ఎవరు సొంతం చేసుకున్నారన్నది మాత్రం ఇంకా బయటపడలేదు.

అలాంటి వాళ్లకు మాత్రమే పవన్ గుండెల్లో స్థానం.. ఎస్జే సూర్య క్రేజీ కామెంట్స్ వైరల్!