ఇంకా కోటికి తగ్గని డీజే టిల్లు సందడి.. ఈ ఏడాది మేటి రికార్డు ఇదే

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఓ రేంజ్ లో వసూళ్లను దక్కించుకుంటూ బాక్సాఫీసు వద్ద కుమ్మేస్తోంది.

ఈ సినిమాకు పోటీగా వచ్చిన రవితేజ ఖిలాడి ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.

దాంతో ఆ సినిమాకు వసూళ్ళు మొదటి రోజే డ్రాప్ అయ్యాయి.రెండో రోజు నుంచి డిజే టిల్లు సినిమా కు కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇప్పటికే 10 కోట్లు దాటిన వసూళ్ళు మెల్ల మెల్లగా పాతిక కోట్ల వైపుకు దూసుకు వెళుతున్నాయి.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పట్టింది.

ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇంకా కూడా ప్రతి రోజు కోట్లకి పైగా షేర్ ని దక్కించుకుంటూ దూసుకు పోతుంది.కరోనా కారణంగా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఏవి కూడా గత కొన్ని రోజులుగా విడుదల కాలేదు.

Advertisement

సంక్రాంతి తర్వాత సినిమా లేక పోవడంతో ప్రేక్షకులు చాలా నిరాశతో ఉన్నారు.ఎట్టకేలకు ఈ సినిమా రావడంతో బాక్సాఫీస్ వద్ద హడావుడి కనిపిస్తుంది.

ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉండడంతో మంచి వసూళ్ల ను సాధిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సిద్ధూ యొక్క నటన ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది.

అతడు చెప్పిన డైలాగ్స్ కుర్ర కారుకు బాగా ఎక్కేసాయి.అందుకే ఈ సినిమాను తెగ చూస్తున్నారు.ఈ సినిమా ముందు ముందు కూడా మరింతగా వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉంది.

వీక్ డేస్ లో ఈ సినిమా ఏకంగా కోటి దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.రాబోయే శని, ఆదివారాల్లో కచ్చితంగా ఈ సినిమా భారీగానే వసూళ్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో నాగ వంశీ నిర్మించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు