తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ( Siddu Jonnalagadda )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకరు.
కాగా సిద్దు జొన్నలగడ్డ తెలుగులో గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింతగాథ వినుమా( Guntur Talkies, Krishna and His Leela, Maa Evantagatha Vinuma ) లాంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఇది ఇలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు ( DJ Tillu )సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో నేహా శెట్టి( Neha Shetty ) హీరోయిన్గా నటించింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా( Tillu Square movie ) విడుదల ఈ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ఇప్పటికే 3 రోజుల్లోనే దాదాపు 70 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.దీంతో ఇదే ఊపులో టిల్లు క్యూబ్‌ను( Tillu cube ) కూడా ప్రకటించేశారు.
అయితే టిల్లు క్యూబ్ ఎలా ఉండబోతుంది? త్రీక్వెల్ అంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా? అనే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇలాంటి వేళ సిద్ధూ టిల్లు క్యూబ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.ఈ సందర్భంగా సిద్ధిజొన్నలగడ్డ మాట్లాడుతూ.డీజే టిల్లులో ఒక అమ్మాయి మోసం చేసే పాయింట్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది.
టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది ఉంది.కానీ ఈ సారి టిల్లు క్యూబ్‌లో టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద కథ ఉండబోతుంది.త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతాను అని సిద్ధూ తెలిపారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఇప్పటివరకూ క్రైమ్ కామెడీ చుట్టూనే టిల్లు స్టోరీలు తిరిగాయి కానీ సడెన్‌గా సూపర్ హీరో ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.కానీ ఇటీవల సూపర్ హీరో సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇది మంచి టర్న్ అంటూ సిద్ధూ ఫ్యాన్స్ అంటున్నారు.
మరి ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా చూడాలి మరీ.ప్రస్తుతానికి అయితే టిల్లు స్క్వేర్ సక్సెస్‌ను మస్త్ ఎంజాయ్ చేస్తున్నాడు సిద్ధూ.