చిన్నప్పుడే తండ్రి మరణం.. అమ్మ చెప్పిన మాటలతో ఎస్సై.. జగదీష్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వల్ల లక్ష్యాలను సాధించడంలో ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

అలా ఎస్సై జాబ్( SI Job ) సాధించడం కోసం ఎన్నో కష్టాలు పడిన వాళ్లలొ ఎస్సై జగదీష్ కుమార్( SI Jagadish Kumar ) ఒకరు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జగదీష్ కుమార్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.జగదీష్ కుమార్ మాట్లాడుతూ నేను పేద కుటుంబంలో జన్మించానని అన్నారు.

నేను ఐదేళ్ల వయస్సులో ఉన్న సమయంలో నాన్న మృతి చెందారని జగదీష్ కుమార్ పేర్కొన్నారు.అప్పటినుంచి మా అమ్మగారు నన్ను చూసుకున్నారని జగదీష్ కుమార్ చెప్పుకొచ్చారు.

మా కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని జగదీష్ కామెంట్లు చేశారు.తిండి తినకుండా గడిపిన రోజులు సైతం మా జీవితంలో ఉన్నయని జగదీష్ చెప్పుకొచ్చారు.

Advertisement

గతంలో సరైన ప్రిపరేషన్ లేకుండా పరీక్షలు రాయడంతో కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాలేదని ఆయన అన్నారు.

కానిస్టేబుల్ జాబ్( Constable Job ) వచ్చిన తర్వాత కూడా ఎంతో కష్టపడి ఎస్సై జాబ్ కు ప్రిపేర్ అయ్యానని జగదీష్ వెల్లడించారు.స్టడీ హాల్ లో ఎక్కువగా ప్రిపేర్ అయ్యానని, మాక్ టెస్ట్ లు( Mock Tests ) ఎక్కువగా రాశానని ఆయన పేర్కొన్నారు.మా అమ్మ నాకు స్పూర్తి అని అమ్మ లేకపోతే నేను జీరో అని జగదీష్ వెల్లడించారు.

నేను ఫెయిల్యూర్స్ లో ఉన్న సమయంలో అమ్మ తన మాటలతో స్పూర్తి నింపారని జగదీష్ వెల్లడించారు.

కష్టపడితే ఏదో ఒకరోజు సక్సెస్ ( Success ) దక్కుతుందని జగదీష్ అన్నారు.జగదీష్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.జగదీష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

బాబు ను వారు నమ్మడం లేదనేగా జగన్ ధీమా ? 
పోలీస్‌కే చుక్కలు చూపించిన దున్నపోతు.. అతను ఏం చేశారో చూస్తే..??

జగదీష్ కుమార్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు