టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్స్‌లో సలార్ కూడా ఒకటి.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.ఇక ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడు.
ఇక ఈ సినిమాకు సలార్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే రివీల్ చేసింది.దీంతో ఈ సినిమాకు కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ తరహాలో ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అనే అంశానికి చిత్ర యూనిట్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టింది.ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్‌ను తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్‌కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంటే బాగుంటుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ భావిస్తూ వస్తోంది.
కాగా శృతి హాసన్‌కు సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందో, నార్త్‌లో కూడా అంతే గుర్తింపు ఉంది.
అందుకే ఆమె అయితే ఈ సినిమాలో పర్ఫెక్ట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.అంతేగాక ప్రభాస్‌తో కొత్త కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు చూపించాలని చిత్ర యూనిట్ సలార్‌లో శృతి హాసన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
అటు శృతి హాసన్ కూడా ఇటీవల క్రాక్ చిత్రంతో తిరిగి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.మరి ప్రభాస్, శృతి కాంబో వెండితెరపై ఎలా ఉండబోతుందో తెలియాలంటే సలార్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.