అఫీషియల్: పవన్ ఓటు ఆమెకేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాతో తన రెండేళ్ల గ్యాప్‌ను సక్సెస్‌తో నింపేయాలని చూస్తున్నాడు పవన్.

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌కు బొమ్మ చూపించాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్.అయితే ఈ సినిమాలో పవన్ సరసన ఓ హీరోయిన్‌ను నటింపజేయాలని చిత్ర యూనిట్ తెగ ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా సాగుతున్నాయి.ఈ క్రమంలో పవన్ సరసన లావణ్య త్రిపాఠీ నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమాలో పవన్ సరసన స్టార్ హీరోయిన్ నటిస్తుందనే వార్త చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా వినిపించింది.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమాలో పవన్ సరసన నటించేందుకు తమిళ బ్యూటీ శృతి హాసన్ అంగీకరించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఒప్పందం కూడా ఆమె కుదుర్చుకుందట.

గతంలో గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్‌తో కలిసి రొమాన్స్ చేసిన శృతి హాసన్ అయితే పవన్ స్థాయికి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందని ప్రేక్షకులు అంటున్నారు.మరి ఈసారి పవన్ సరసన ఆమె చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు