వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించని శృతి !

పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత రాబోతున్న వకీల్ సాబ్ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ వచ్చింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడు చూద్దామా అన్నట్టు పవన్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ వీర లెవల్లో ఇస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది.ఈ సినిమాలో శృతి హాసన్ కీలక రోల్ చేస్తుంది.

ఏప్రిల్ 9 న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇంతవరకు శృతి హాసన్ ఈ ప్రమోషన్స్ లో కనిపించలేదు.కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి, నివేతా థామస్, అనన్య ముగ్గురు ప్రమోషన్స్ చేస్తున్నారు.

Advertisement

కానీ శృతి మాత్రం ఎక్కడ కనిపించలేదు.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా శృతి కనిపించలేదు.అంతేకాదు ఈ ఈవెంట్ లో పవన్ అందరి గురించి మాట్లాడాడు కానీ శృతి పేరు మాత్రం పవన్ నోటా మాత్రమే కాదు ఎవ్వరి నోటా వినిపించలేదు.అంతేకాదు వకీల్ సాబ్ ట్రైలర్ లో కూడా శృతి హాసన్ కనపడలేదు.

ఈమె పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందని ఈ పాత్ర రివీల్ అవ్వకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.ఇది ఇలా ఉండగా వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.పవన్ శృతి ఇప్పటికే రెండు సినిమాల్లో కలిసి నటించారు.

Advertisement

ఇప్పుడు మూడవసారి జత కట్టారు.చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుంటుందో.

తాజా వార్తలు