Shruthi Hassan: నలుగురిలో ఆ పని చేయలేను.. కానీ నాలుగు గోడల మధ్య చేస్తా.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్!

కమల్ హాసన్( Kamal Hassan ) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్ ( Shruthi Hassan ) ఒకరు.

ఇక ఈ ఏడాది ఈమె తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ఈ రెండు సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శృతిహాసన్ త్వరలోనే ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్(Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఇక ఈ సినిమా ద్వారా మొదటిసారి ఈమె ప్రభాస్ సరసన నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత శృతిహాసన్ తన తదుపరి సినిమాల గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు .ఇక సినిమాల పరంగా పక్కనపెట్టి ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే శృతిహాసన్ తన వ్యక్తిగత జీవితం( Personal Life )లో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ప్రస్తుతం శంతను హజారికా ( Santanu Hazarika ) అనే వ్యక్తితో ప్రేమలో ఉండడమే కాకుండా ఆయనతో సహజీవనం కూడా చేస్తున్నారు.ఇక తన ప్రియుడితో కలిసి శృతిహాసన్ తరచూ సోషల్ మీడియా వేదికగా చేసే హంగామా మామూలుగా ఉండదు.ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ప్రియుడితో సహజీవనం చేస్తున్నటువంటి ఈమె పెళ్లి మాత్రం చేసుకోనని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈమె తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.వారు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ ఉంటారు.తాజాగా ఒక అభిమాని మాత్రం శృతిహాసన్ ను ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న అడిగారు.

మీరు ఎప్పుడైనా ఎమోషనల్ అయిన సమయాలలో ఏడుస్తారా అంటూ తనని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ తాను చాలా ఎమోషనల్ పర్సన్( Emotional person ) అని తెలిపారు సినిమాలలో ఏదైనా కొంచెం ఎమోషనల్ సన్నివేశాలు వస్తే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అయితే నలుగురిలో ఉన్నప్పుడు నేను ఏడ్చను కానీ నాలుగు గదుల మధ్యలో ఉన్నప్పుడు బాగా ఏడుస్తానని, గట్టిగా ఏడవడం వల్ల నా మనసులో ఉన్న బాధంతా వెళ్ళిపోతుంది.కేవలం 4 గోడల మధ్య మాత్రమే తాను ఈ పని చేయగలను గాని నలుగురిలో ఉన్నప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు బయటకు కూడా రావు అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు