ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన టువంటి ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన మోడరన్ గర్ల్ ఫ్రెండ్ గా నటించి తన అందచందాలతో కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచిన శ్రద్దాదాస్ అంటే తెలియని వారు ఉండరు.మంచి అభినయం, అందం కలిగి ఉన్న ఈమెకు తెలుగులో తన నటన నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాక తెలుగు సినీ పరిశ్రమలో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమ పడుతోంది ఈ అమ్మడు.
అయితే తాజాగా ఈ ముఖ్య మరో విభిన్నమైన పాత్రలో నటించేందుకు అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది.తాజాగా సీనియర్ నటుడు జగపతిబాబు నటిస్తున్న ఓ చిత్రంలో ఈ అమ్మడు వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.
అలాగే ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ వేశ్య పాత్రలలో నటించినటువంటి అనుష్క శెట్టి, సీనియర్ నటి సదా, విద్యాబాలన్ వంటి వాళ్ళు మంచి అవకాశాలతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.దీంతో ఈ అమ్మడు కూడా అదే తరహాలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.