ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ( YCP Minister Botsa Satyanarayana ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.30 మంది ఐఏఎస్ లపై సీఈసీకి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారన్న ఆయన వారిని సీఎం జగన్ నియమించారా అని ప్రశ్నించారు.గతంలో వారు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ( Chandrababu ,Kiran Kumar Reddy )మరియు రోశయ్య ప్రభుత్వ హయాంలో పని చేయలేదా అని నిలదీశారు.వారందరిపై చర్యలు తీసుకుంటే ఎన్నికలు నిర్వహించేది ఎవరో చెప్పాలన్నారు.
లేకపోతే వారిని కాదని హెరిటేజ్ ఫుడ్స్ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలా అని విమర్శించారు.