హెరిటేజ్ ఫుడ్స్ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలా..?: మంత్రి బొత్స
TeluguStop.com
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ( YCP Minister Botsa Satyanarayana ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
30 మంది ఐఏఎస్ లపై సీఈసీకి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారన్న ఆయన వారిని సీఎం జగన్ నియమించారా అని ప్రశ్నించారు.
గతంలో వారు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ( Chandrababu ,Kiran Kumar Reddy )మరియు రోశయ్య ప్రభుత్వ హయాంలో పని చేయలేదా అని నిలదీశారు.
వారందరిపై చర్యలు తీసుకుంటే ఎన్నికలు నిర్వహించేది ఎవరో చెప్పాలన్నారు.లేకపోతే వారిని కాదని హెరిటేజ్ ఫుడ్స్ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలా అని విమర్శించారు.