స్కూటీపై వెళ్తూ షాకింగ్ పని.. ఇలాంటి వాళ్లని అసలు ఏం చేయాలి..

హైదరాబాద్, ఢిల్లీ వంటి సిటీల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది.ప్రమాదాలు కూడా ఇక్కడ జరిగే అవకాశాలు ఎక్కువ.

అందుకే ఈ సిటీల పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంటారు.జాగ్రత్తలను కూడా తెలుపుతుంటారు.

అవగాహన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ జాగ్రత్తగా ఉండమని గుర్తు చేస్తారు.ఇందులో భాగంగా తాజాగా ముంబై( Mumbai ) పోలీసులు ఒక వీడియో షేర్ చేశారు.

ఆ వీడియోలో ఒక వ్యక్తి హెల్మెట్( Helmet ) ధరించి స్కూటీపై వెళ్తున్నాడు.అయితే అతడు తన ప్రాణాలనే కాకుండా తోటి ప్రయాణికుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పడేసే విధంగా రైడ్ చేస్తున్నాడు.

Advertisement

అది ఎలా అంటే, అతను స్కూటర్ హ్యాండిల్ పూర్తిగా వదిలేశాడు.తన చేతులను కాళ్ల మధ్యలో పెట్టుకుని చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు.

పరిశీలనగా చూస్తే అతను ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ( Ola Electric Scooters )నడుపుతున్నాడని తెలుస్తుంది.అందులో క్రూయిజ్ కంట్రోల్ ఉండటం వల్లనేమో అది యాక్సిలరేషన్ ఇవ్వకపోయినా దూసుకెళ్తోంది.కానీ ఆ హ్యాండిల్ ఏ క్షణానైనా ఒక్కసారిగా పక్కకు తిరగవచ్చు.

అదే జరిగితే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మనం కూడా ఊహించలేం. హ్యాండిల్‌ను గాలికి వదిలేసి స్కూటర్ నడుపుతున్న ఆ వ్యక్తిని మరో వ్యక్తి కారులో నుంచి వీడియో రికార్డ్ చేశాడు.

అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయగా అది విపరీతంగా వైరల్ గా మారి చివరికి ముంబై పోలీసుల దృష్టికి వచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆ వీడియో షేర్ చేస్తూ "మీకు గాలిలో ఎగరడం అంటే ఇష్టమా.జాగ్రత్త.ఇలాంటి రెక్లెస్ రైడింగ్ చేస్తే ఇంకా పైకి వెళ్లే ప్రమాదం ఉంది.

Advertisement

" అని ముంబై పోలీస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్యాప్షన్ రాసింది.అయితే అతను స్కూటర్ ముంబై నగరంలో రైడ్‌ చేశాడా? లేదంటే వేరే ప్రాంతంలో రైడ్‌ చేశాడా? అనేది తెలియ రాలేదు ఎందుకంటే ముంబై రోడ్లు హ్యాండిల్ వదిలేసి రైడ్ చేసేంత ఖాళీగా రోడ్లు ఉండవు.ఏది ఏమైనా ఇలాంటి స్టంట్స్ చేయకుండా జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం.

లేదంటే కాళ్లు చేతులు విరగడమో, లేదంటే ప్రాణాలే పోవడమే జరుగుతుంది.

తాజా వార్తలు