టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అద్దుకున్నటువంటి వారిలో అక్కినేని హీరో నాగార్జున (Nagarjuna)ఒకరు.అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలుస్తుంది.అదేవిధంగా మరికొన్ని వ్యాపార రంగాలలోనూ కూడా ఈయన దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా నాగార్జున గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు నాగార్జున పై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడమే కాకుండా కోట్ల ఆస్తి ఉన్న ఇంత పిసినారితనం ఏంటి నాగార్జున నీకు తండ్రి కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇలా నాగార్జునను ట్రోల్ చేయడానికి గల కారణం ఏంటి అసలేం జరిగింది అనే విషయానికి వస్తే… అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోలో( Annapurna Studios ) పంచలోహపు నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులు అందరిని రిసీవ్ చేసుకోవడంలో నాగచైతన్య అఖిల్ నాగార్జున బిజీగా ఉండిపోయారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ కార్యక్రమంలో నాగార్జున వేసుకున్నటువంటి డ్రెస్(Nagarjuna Dress) పై అందరి చూపు పడింది దీంతో ఈయన వేసుకున్నటువంటి ఈ డ్రెస్ ఎంత అనే విషయం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఇలా ఈ డ్రెస్ గురించి సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక షాకింగ్ విషయం బయటపడింది.
నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలలో భాగంగా నాగార్జున ధరించిన ఈ చొక్కా దాదాపు రెండు సంవత్సరాల క్రితం బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో భాగంగా నాగార్జున ధరించారట అయితే ఇదే చొక్కాని తిరిగి నాగార్జున శత జయంతి వేడుకలకు వేసుకురావడంతో నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా నాగార్జునను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.ఈ షర్టు ఖరీదు దాదాపు 85 వేల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది.ఇలా సెలబ్రిటీలు సాధారణంగా ఒక కార్యక్రమానికి వేసుకున్నటువంటి దుస్తులను మరో కార్యక్రమానికి వేసుకోరు కానీ నాగార్జున మాత్రం తన తండ్రికి ఎంతో ముఖ్యమైనటువంటి వేడుకలో భాగంగా ఇలాంటి డ్రెస్ వేసుకోవడంతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఇలా కొందరు ఈ వ్యవహారంపై స్పందిస్తూ కొన్ని వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి కదా నాగార్జున తండ్రి కోసం చేస్తున్నటువంటి ఓ గొప్ప కార్యక్రమానికి కొంత డబ్బు ఖర్చు చేసి కొత్త డ్రెస్ కొనలేవా మరి ఇంత కక్కుర్తి ఏంటి అంటూ భారీ స్థాయిలో నాగార్జున పై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.ఏది ఏమైనా ఈ ఒక్క తప్పు కారణంగానే నాగర్జున ప్రస్తుతం నేటిజన్ల ట్రోలింగ్ కి గురికావాల్సి వస్తుంది.