సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో అల్లరి నరేష్ ( Allari Naresh )ఒకరు.ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాల్లో వైవిధ్యమైతే చూపిస్తున్నాడు కానీ మళ్లీ ఒకే తరహా సినిమాలు చేస్తున్నాడు అనే పేరు సంపాదించుకుంటున్నాడు.
ఇంతకు ముందు వరుసగా ఆయన కామెడీ సినిమాలు చేసి ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిన అల్లరి నరేష్ ప్రస్తుతం వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు.ఒకే జానర్ కి సంబంధించిన సినిమాలు ఒకటి, రెండు అయితే పర్లేదు కానీ వరుసగా అవే తరహా సినిమాలు చేస్తే మాత్రం ఆ హీరో ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమనే చెప్పాలి .
అది ఇప్పటికైనా అల్లరి నరేష్( Allari Naresh ) తెలుసుకుంటే మంచిది.ఇక ఇప్పటికైనా ఆయన అన్ని జానర్స్ లను టచ్ చేస్తూ సినిమా చేస్తే బాగుంటుంది.ఒకే జానర్ కి స్టిక్ అయిపోయి అవే సినిమాలు చేస్తాను అంటే ఇండస్ట్రీలో వర్కౌట్ అవ్వదు.ప్రస్తుతం అల్లరి నరేష్ పరిస్థితి కూడా అలానే ఉంది ఆయన ఇప్పటికైనా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంటూ ముందుకెళ్తే ప్రాబ్లం లేదు కానీ అలా కాకుండా ఒకే రకమైన జానర్ లో సినిమాలు చేస్తానంటే ఇండస్ట్రీ నుంచి తొందర్లోనే ఫేడ్ అవుట్ అవ్వాల్సి వస్తుంది.
అల్లరి నరేష్( Allari Naresh ) సోలో హీరోగా సినిమాలు చేస్తూనే చిరంజీవి ( Chiranjeevi )హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.నిజానికి ఈ క్యారెక్టర్ లో మొదట ఒక తమిళ్ హీరోని తీసుకోవాలి అనుకున్నప్పటికీ ఆయన కంటే కూడా అల్లరి నరేష్ బాగా సెట్ అవుతాడని నరేష్ కి ఆ కథ చెప్పి ఆ క్యారెక్టర్ లోకి ఆయనని తీసుకోవడం జరిగింది.అందులో భాగంగానే ఆయన ఇప్పుడు వరుసగా చేయాల్సిన సినిమాలు తొందరగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు.ఇక దాదాపు 20 రోజులపాటు తన డేట్స్ ని చిరంజీవి సినిమా కోసం కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది…
.