చెట్టు కిందకు తీసుకెళ్లిన ధర్మామీటర్‌లో షాకింగ్ రిజల్ట్.. ఏమైందంటే..

గత కొద్ది వారాలుగా భారతదేశం( India )లో ఎండలు మండిపోతున్నాయి.ఏ రాష్ట్రంలో చూసినా 40 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దీంతో బయట పది నిమిషాలు నిలుచున్నా సొమ్మసిల్లి కింద పడిపోయే పరిస్థితి నెలకొన్నది.ఈ నేపథ్యంలో బయటికి వెళ్లేవారు చెట్ల నీడ కింద ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ క్రమంలోనే చెట్టు నీడ కింద ఉష్ణోగ్రతల ఎంత నమోదవుతాయో తెలిపే ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక మహిళ చెట్టు కిందకి వెళ్లగానే ధర్మామీటర్‌లో షాకింగ్ రిజల్ట్ కనిపించింది.

దాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఇంతకీ ఏంటా రిజల్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Shocking Result In The Thermometer ,taken Under The Tree.. What Happened ,india,
Advertisement
Shocking Result In The Thermometer ,taken Under The Tree.. What Happened ,India,

వివరాల్లోకి వెళితే.ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌( West Bengal )లో ఎండల తీవ్రత బాగా పెరిగింది ఇక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.అందుకే స్కూల్స్, కాలేజీలు కూడా బంద్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ధర్మామీటర్‌ చేత పట్టుకొని తమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో నమోదు అవుతున్నాయో చూపించాలనుకున్నారు.అనుకున్నదే తడవుగా మొదటగా ఆమె ధర్మామీటర్ ( Thermometer )పట్టుకొని ఆరు బయటికి వెళ్ళారు.

అప్పుడు అందులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.తర్వాత తను వెనక్కి నడుస్తూ వెళ్ళారు.

అలా వెళ్తూ ఉంటే చెట్టు నీడ వస్తూ ఉండగా ధర్మామీటర్‌లో రీడింగ్ అనేది తగ్గుతూ వచ్చింది.చివరికి ఆమె చెట్టు నీడ కిందకు పూర్తిగా రాగా అప్పుడు ధర్మామీటర్‌లో 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు కనిపించింది.

Shocking Result In The Thermometer ,taken Under The Tree.. What Happened ,india,
'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
రైలులోని అమ్మాయిలపై నీళ్లు చల్లిన యువకుడు.. వీపు పగిలేలా కొట్టిన పోలీస్ (వీడియో)

అంటే దాదాపు చలికాలంలో లాగా చెట్టు కింద ఉష్ణోగ్రత నమోదయింది.దాదాపు 15 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గడంతో దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.కొందరు దీనిని తాము నమ్మలేమని అంటున్నారు.

Advertisement

మరికొందరేమో ఇంకొద్ది అడుగులు వెనక్కి వేసి ఉంటే ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి మీరు గడ్డకట్టుకు పోయే వారేమో అని ఫన్నీగా కామెంట్ చేశారు.

కాగా చెట్టు కింద చల్లగా ఉంటుందనడంలో సందేహం లేదు.కానీ మరీ ఇంత చల్లగా ఉంటుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.సుభాషిని చంద్రమణి అనే మహిళ ఈ ఉష్ణోగ్రతలు నమోదు చేసి వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

దాన్ని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు