షాకింగ్ న్యూస్.. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్

భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.ఈ దుర్ఘటనలో రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

రూర్కీకి తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.రూర్కీలోని గురుకుల్ నర్సన్ ప్రాంతంలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

పంత్ కారు బాగా దెబ్బతింది.భారత స్టార్ క్రికెటర్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటికొచ్చాయి.

అందులో రిషబ్ పంత్‌కు తీవ్రమైన గాయాలు కనిపిస్తున్నాయి.పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత ఆయన కారులో భారీ మంటలు చెలరేగాయి.

Advertisement

ప్రమాదం తర్వాత పంత్‌ను ఆసుపత్రిలో చేర్చారు.రిషబ్ పంత్ కాలికి బలమైన గాయమైందని వైద్యులు తెలిపారు.

అతనికి సర్జరీ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.మెరుగైన చికిత్స కోసం పంత్‌ను డెహ్రాడూన్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సిఫార్సు చేశారు.

కారు యాక్సిడెంట్ తర్వాత అక్కడి ప్రజలు రిషబ్ పంత్‌ను 108 సహాయంతో రూర్కీ సివిల్ హాస్పిటల్‌కు పంపినట్లు సమాచారం.రిషబ్ పంత్ నుదుటిపైన, కాలికి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ దేహత్ స్వప్న కిషోర్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని, రూర్కీ నుంచి డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ తెలిపారు.భారత క్రికెట్ జట్టు జనవరి మొదటి వారంలోనే శ్రీలంకతో స్వదేశంలో తదుపరి సిరీస్ ఆడాల్సి ఉంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

భారత్-శ్రీలంక మధ్య టీ20, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి.ఇందు కోసం టీమిండియాను ప్రకటించారు.

Advertisement

అయితే ఈ రెండు సిరీస్‌ల నుంచి రిషబ్ పంత్ తప్పుకున్నాడు.అతనిని మినహాయించడానికి BCCI ఎటువంటి కారణం చెప్పలేదు.

ఇప్పటికే ఫిట్‌నెస్ లేని పంత్‌ను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)లో రిపోర్టు చేయాల్సిందిగా బిసిసిఐ కోరింది.ఇంతలోనే ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

తాజా వార్తలు