ఈ మధ్య కాలంలో దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనల గురించి వింటే ఇలా చేసేవాళ్లు కూడా ఉంటారా? అని ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది.కష్టపడి భార్యను చదివించి ఒక భర్త నర్సును చేయగా భార్య మాత్రం భర్త నల్లగా ఉన్నాడనే సాకు చూపుతూ అతనిని వదిలేసింది.
ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియా ( Social media )వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.ఉత్తరప్రదేశ్( Uttarpradesh ) లోని రవీంద్రపురం గ్రామంలో నివశించే అర్జున్ కు ఆరేళ్ల క్రితం సవితా మౌర్య అనే యువతితో పెళ్లి జరిగింది.
భార్యకు చదువుపై ఆసక్తి ఉండటంతో పేదవాడు అయినప్పటికీ అర్జున్ ఎంతో కష్టపడి ఫీజులు కట్టి భార్యను నర్సింగ్ చదివించాడు.అప్పులు చేసి మరీ భార్యను చదివించిన అర్జున్ భార్యకు మంచి ఉద్యోగం వస్తే కుటుంబ కష్టాలు తీరతాయని సంతోషంగా జీవనం సాగించవచ్చని భావించాడు.
తానొకటి తలిస్తే దేవమొకటి తలచిందనేలా అర్జున్ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.అర్జున్( Arjun ) భార్య నర్సు ఉద్యోగం తెచ్చుకుంది.ఉద్యోగం వచ్చిన తర్వాత సవిత మరో ప్రముఖ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరడంతో ఆమె వేతనం భారీగా పెరిగింది.అయితే తనను ఎంతో కష్టపడి చదివించిన భర్తను గౌరవించడానికి బదులుగా ఆ యువతి తన భర్త నల్లగా ఉన్నాడంటూ అతని ముందే హేళన చేస్తూ కామెంట్లు చేసింది.
నా స్టేటస్ కు నీ స్టేటస్ కు సూట్ కాదంటూ సూటిపోటి మాటలతో అతనిని బాధ పెట్టింది.
ప్రతి నెలా రేయింబవళ్లు శ్రమించి కష్టపడి చదివిస్తే భార్య ఈ విధంగా చేయడం అర్జున్ ను ఎంతగానో బాధ పెట్టింది.ఏం చేయాలో పాలుపోని అర్జున్ మీడియాను ఆశ్రయించి తన ఆవేదనను వ్యక్తం చేశారు.భార్య సక్సెస్ లో తన సక్సెస్ ను చూసుకున్న భర్తతో సదరు యువతి ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రంగును కాకుండా సవిత గుణాన్ని చూడాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.భర్త ఆరోపణలపై సవిత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.