ఓటీటీల వల్ల పిల్లలు చెడిపోతున్నారు...నటి కామెంట్స్ వైరల్!

కరోనా వచ్చిన తర్వాత థియేటర్లన్నీ మూతపడటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఓటీటీ( Ott ) లు అందుబాటులోకి వచ్చాయి.ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి .

 Children Are Getting Spoiled Due To Otts, Ott Platform, Gadar2, Sunny Deol, To-TeluguStop.com

ఓటీటీల ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో కాస్త బోల్డ్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఏమాత్రం అడ్డు లేకుండా ఉంది.దీంతో చాలామంది సెలబ్రిటీలు ఈ ఓటీటీ వ్యవస్థ పై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ విమర్శలు కురిపించారు.

ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటి అమీషా పటేల్ ( Ameesha Patel ) సైతం ఓటీటీల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Ameesha Patel, Bollywood, Gadar, Ott Platm, Sunny Deol, Tollywood-Movie

అమీషా పటేల్ హీరోయిన్గా తెలుగు హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.అయితే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టువంటి అమీషా పటేల్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె నటించిన గదర్ 2 ( Gadar2 ) సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అమీషా పటేల్ తాజాగా ఓటీటీల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Telugu Ameesha Patel, Bollywood, Gadar, Ott Platm, Sunny Deol, Tollywood-Movie

ఈ సందర్భంగా ఈమె ఓటీటీల గురించి మాట్లాడుతూ.ప్రస్తుతం ఓటీటీల్లో క్లీన్ కంటెంట్ కంటే కూడా.స్వలింగ సంపర్కం, గే-లెస్బియానిజం ఎక్కువైపోయిందంటూ.సంచల కామెంట్స్ చేసింది.అంతే కాదు ఇలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలని అయితే ఇవి పిల్లలకు చాలా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు వెబ్ సిరీస్ లు చూడటం వల్ల పిల్లలు చెడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని ప్రస్తుత కాలంలో కుటుంబమంతా కలిసికూర్చుని సినిమా చూసే యుగం కాదు ఇది అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే అమీషా పటేల్ చేసిన ఈ కామెంట్స్ పై కొందరు తనకు మద్దతు తెలుపుగా మరి కొందరు ఈమెను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube