ప్రముఖ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కొడుకు ఎమ్మెస్ విక్రమ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాన్నగారికి మలేరియా వచ్చిందని ఆ వ్యాధిని గుర్తించలేకపోయారని అన్నారు.
ఫెస్టివల్ సీజన్స్ వల్ల డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని విక్రమ్ అన్నారు.భగవంతుడికి మంచి వాళ్లు కావాలని ఎమ్మెస్ విక్రమ్ కామెంట్లు చేశారు.
నాన్న చాలా ఆనందంగా వెళ్లిపోయారని విక్రమ్ పేర్కొన్నారు.నాన్న జర్నీ బ్యూటిఫుల్ జర్నీ అని విక్రమ్ అన్నారు.
నాన్నగారు లేనట్టు నేను ఎప్పుడూ ఫీల్ కానని విక్రమ్ పేర్కొన్నారు. చిరంజీవి గరికపాటి వివాదం గురించి విక్రమ్ మాట్లాడుతూ నేను పుట్టకముందు నుంచి చిరంజీవి మెగాస్టార్, సుప్రీం హీరో అని విక్రమ్ కామెంట్లు చేశారు.
నేను బాల్యంలో ఉన్న సమయంలో చిరంజీవి రాజమండ్రికి వస్తే ఆయన స్టేజ్ ఎక్కడానికి కింద ఉన్నవాళ్లు చేతులు పెట్టారని విక్రమ్ అన్నారు.

ఇది నేను కళ్లారా చూసిన విషయం అని ఆయన కామెంట్లు చేశారు.ఆరోజు ఆయన జనాలను ఇబ్బంది పెట్టలేక స్టేజ్ కూడా ఎక్కలేదని ఆయన పేర్కొన్నారు.చిరంజీవి నాన్నగారు చనిపోయిన సమయంలో నిమిషానికి ఒకరు చిరంజీవి కాళ్లపై పడి బాధను పంచుకున్నారని ఆయన తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి సహాయం చేశారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

నాన్నగారికి డెంగ్యూ వచ్చిన సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం అందిందని ఆయన చెప్పుకొచ్చారు.చిరంజీవి లాంటి వ్యక్తి వస్తే ఫోటోలు దిగరా అని ఆయన అన్నారు.చిరంజీవి గారు మహా మనిషి అని అందువల్లే ఆయనతో ఫోటోలు దిగారని విక్రమ్ చెప్పుకొచ్చారు.
గరికపాటి చెప్పిన విధానం కరెక్ట్ కాదని ఆయన కామెంట్లు చేశారు.ఇది నా భావన మాత్రమేనని ఎమ్మెస్ నారాయణ కొడుకు కామెంట్లు చేయడం గమనార్హం.







