స్టార్ హీరో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం వేగంగా సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు మాత్రం మాత్రం దొరకడం లేదు.ప్రముఖ టాలీవుడ్ ఎడిటర్లలో ఒకరైన మార్తాండ్ కె వెంకటేష్ కు( Marthand K Venkatesh ) పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఉంది.
ఈ ఎడిటర్ సినిమా రిలీజ్ కు ముందే ఫలితాన్ని అంచనా వేయగలరు.అదే సమయంలో ఈ ఎడిటర్ చెప్పిన సూచనల వల్ల సినిమాలలో మార్పులు చేసి సక్సెస్ సాధించిన సందర్భాలు సైతం ఉన్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ఎడిటర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ ఉంటే పరుగెత్తాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.ఆ సమయంలో ఇంపార్టెన్స్ కు ప్రాధాన్యత ఇస్తామని మార్తాండ్ కె వెంకటేష్ అన్నారు.ఇతర హీరోల సినిమాల గురించి ఎవరూ ఆలోచించరని ఆయన కామెంట్లు చేశారు.
పవన్ కళ్యాణ్ నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారని ఆయన తెలిపారు.
పవన్ నన్ను ఇంటికి పిలిచి జానీ( Johnny Movie ) కథ చెప్పారని పవన్ నాకు చాలా క్లోజ్ అని మార్తాండ్ కె వెంకటేశ్ అన్నారు.గుడుంబా శంకర్( Gudumba Shankar ) మూవీ గంట సినిమా ఎడిట్ చేశాక సినిమా నచ్చలేదని చెప్పడంతో వాళ్లు హర్ట్ అయ్యారని అప్పటినుంచి పవన్ సినిమాలకు పని చేయడం తగ్గిందని గుడుంబా శంకర్ విషయంలో నా జడ్జిమెంట్ నిజమైందని ఆయన పేర్కొన్నారు.బద్రి సినిమా క్లైమాక్స్ విషయంలో పవన్ మార్పులు చేశారని మార్తాండ్ కె వెంకటేశ్ కామెంట్లు చేశారు.
పవన్ తన సినిమాలలో సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఆయనే కంపోజ్ చేసేవారని డైరెక్టర్లకు సంబంధం ఉండేది కాదని మార్తాండ్ కె వెంకటేశ్ చెప్పుకొచ్చారు.పవన్ సినిమాలలో ఫైట్లు రియాలిటీగా ఉంటాయని ఆయన తెలిపారు.పవన్ తన సినిమాలలో ఫైట్స్, సాంగ్స్ ను ఆయనే డైరెక్ట్ చేస్తారని ఈ విధంగా వెల్లడైంది.