టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో గెటప్ శ్రీను( Getup Srinu ) ఒకరు కాగా గెటప్ శ్రీనుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.గెటప్ శ్రీను ఈ మధ్య కాలంలో నటించిన మా ఊరి పొలిమేర 2,( Maa Oori Polimera 2 ) హనుమాన్( Hanuman ) సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి సక్సెస్ సాధించాయి.
పాత్ర ఏదైనా పర్ఫామెన్స్ తో ప్రాణం పోస్తూ గెటప్ శ్రీను వార్తల్లో నిలిచారు.గెటప్ శ్రీను రూపంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో గొప్ప నటుడు దొరికారు.
గెటప్ శ్రీనును సరిగ్గా వాడుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో సునీల్ అవుతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.కామెడీ అయినా వైవిధ్యమైన రోల్ అయినా ఎమోషనల్ సీన్స్ అయినా గెటప్ శ్రీను తన పాత్రలకు సంబంధించి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు.
గెటప్ శ్రీను సైతం మంచి పాత్రలకు మాత్రమే ఓటేస్తే కెరీర్ బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
గెటప్ శ్రీను ఒకవైపు జబర్దస్త్ షోలో( Jabardasth Show ) కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలలో నటిస్తున్నారు.గెటప్ శ్రీను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక పడిన కష్టం అంతాఇంతా కాదు.శ్రీకాకుళం జిల్లాకు( Srikakulam ) చెందిన గెటప్ శ్రీను అంచెలంచెలుగా ఎదుగుతూ సత్తా చాటుతున్నారు.
ఇతరులను సైతం గెటప్ శ్రీను అద్భుతంగా ఇమిటేట్ చేస్తారనే సంగతి తెలిసిందే.
చిరంజీవి( Chiranjeevi ) సినిమాలలో గెటప్ శ్రీనుకు ఎక్కువగా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.ఇప్పటివరకు గెటప్ శ్రీను 70కు పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.గెటప్ శ్రీను పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఎక్కువగా నటించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సైతం గెటప్ శ్రీను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.గెటప్ శ్రీను కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.