'సీతారామం'లో సీత ఫ్రెండ్ గా నటించిన ఆ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్లు ఎంతో అందంగా కనిపించేలా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

కాని కొన్ని కొన్ని సార్లు మాత్రం దర్శక నిర్మాతలు ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నా సినిమాల్లొ హీరోయిన్లు అందంగానే కనిపించినప్పటికీ వారి స్నేహితుల పాత్రల్లో నటించిన అమ్మాయిలు కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి.

ప్రేక్షకుల దృష్టి ఇక హీరోయిన్లతో పాటు వారి స్నేహితుల అందం మీదికి కూడా వెళుతూ ఉంటుంది.అయితే ఇలా ఇటీవల కాలంలో ఏకంగా హీరోయిన్లకు ఎక్కడ తగ్గకుండా వారి స్నేహితురాలి పాత్రలను కూడా దర్శకులు డిజైన్ చేస్తున్నారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల కాలంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాలో హీరోయిన్ అందం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించిన అమ్మాయి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ సినిమా ఏదో కాదు సీతారామం దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన అందం అభినయంతో ఆకట్టుకుంది.అదే సమయంలో స్నేహితురాలి హీరోయిన్ పాత్రలో నటించిన యువతి కూడా అందరినీ ఆకట్టుకుంది.ఇక ఆ యువతికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హీరోయిన్ స్నేహితురాలి పాత్ర చేసిన అమ్మాయి పేరు రుక్మిణి విజయ్ కుమార్.ఆమె నటి మాత్రమే కాదు డాన్స్ కొరియోగ్రాఫర్.

భరతనాట్యం కూడా నేర్చుకుంది.అయితే ఆమెది హైదరాబాద్ కావడం గమనార్హం.

ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కూడా నటించింది.అంతేకాదు ఆనంద తాండవం అనే సినిమాలో కూడా రొమాంటిక్ పాత్ర చేసింది రుక్మిణి విజయ్ కుమార్.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కచ్చాడియన్ సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించింది.ఇక సీతారామం పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు