చిన్నప్పుడు వాటిని దొంగతనం చేసేదాన్ని.. రాజశేఖర్ కూతురు షాకింగ్ కామెంట్స్!

రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హీరోయిన్ గా శివాని తనకంటూ మంచి పేరును సొంతం చేసుకుంది.

రాజశేఖర్, జీవిత కూతురు కావడంతో ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే శివానికి మంచి పేరు వచ్చింది.తాజాగా శివాని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఎంబీబీఎస్ చదివిన శివాని నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.పాత్రతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రలో నటించినా నటిగా తన పాత్రకు శివాని పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు.

కథ నచ్చితే గ్లామర్ రోల్స్ లో నటించడానికి కూడా సిద్ధమేనని శివాని చెప్పకనే చెప్పేస్తున్నారు.అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ తో తాజాగా మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న శివాని రాజశేఖర్ చిన్నప్పుడు తాను బొంగరాలు కొట్టేసేదానినని అన్నారు.

Advertisement

ఇంటికి తెచ్చి వాటిని ఎవరికీ తెలియకుండా తిప్పేదానినని శివాని చెప్పుకొచ్చారు.

అలా చేస్తూ తాను తెగ సంతోషించేదానినని ఈ విషయం ఇప్పటివరకు తన పేరెంట్స్ కు కూడా తెలియదని శివాని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.శివాని వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.ఈ విషయం తెలిసి రాజశేఖర్ కూతురిలో ఇలాంటి కలలు కూడా ఉన్నాయా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శివాని కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

మోడల్ గా కూడా శివాని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.అద్భుతం సినిమాలో శివాని నటనకు ప్రశంసలు దక్కాయి.తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాలలో కూడా నటించారు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

శివాని రాజశేఖర్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.శివానికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు