పాన్ ఇండియా సినిమాలలో నటించేందుకు కండిషన్లు పెడుతున్న హీరో శివ కార్తికేయన్!

తమిళ సినీ పరిశ్రమలో ఎవరు ఎప్పుడు స్టార్ హీరో అవుతారో చెప్పలేము.ఎందుకంటే తమిళ సినిమా గ్రాఫ్ ని ఒకసారి పరిశీలిస్తే, సంవత్సరానికొక్కరు స్టార్లు అయిపోతూ వుంటారు.

 Shiva Karthikeyan Is The Hero Who Is Conditioned To Act In Pan India Movies , P-TeluguStop.com

ఎందుకంటే అక్కడ హీరోని బట్టి కాకుండా వారు చేసే సినిమాలను బట్టి, నటన బట్టి అక్కడ సినీ ప్రేక్షకులు ఆరాధిస్తూ వుంటారు.అందుకనే అక్కడ నటులు అనేకమంది వుంటారు.

ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా హిట్స్ మీద హిట్స్ కొడుతూ ఓ హీరో ముందుకు దూసుకు వెళ్తున్నాడు.అతడే హీరో శివ కార్తికేయన్.

అంతేకాకుండా రెమో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు ఈ తమిళ్ స్టార్.

రెమో సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది.

ఇక ఇటీవల వరుణ్ డాక్టర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ప్రియాంక అరుళ్ మోహన్ .శివకార్తికేయన్ జంటగా నటించిన ఈ సినిమా తమిళంతోపాటు.తెలుగులో మంచి వసూళ్లు రాబట్టింది.

ఇక తాజాగా ఇతగాడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం పేరు డాన్.ఈ సినిమాను శిబి చక్రవర్తి డైరెక్టర్ చేస్తున్నాడు.ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Telugu Pan India, Latest, Priyankaarul, Remo, Tamil, Varun-Latest News - Telugu

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడిన శివకార్తికేయన్ పాన్ ఇండియా చిత్రాలపై ఓ విలేఖరి అడిగిన దానికి మాట్లాడుతూ… తాను పాన్ ఇండియా సినిమాలు చేయాలంటే కంటెంట్ సరికొత్తగా ఉండాలని, అలాంటి సినిమాలే ఆడుతాయని, అటువంటి కథతో ఎవరన్నా వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.ఇక డాన్ సినిమాపై స్పందిస్తూ, డైరెక్టర్ శిబి చక్రవర్తి స్టోరీ చెప్పగానే తన కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయని.కుటుంబం మొత్తం కలిసి చూడదగిన సినిమా డాన్ అన్నారు.అంతేకాకుండా.తనకు సినిమాల్లో పాటల్లో రాయాలనేది కేవలం తన స్నేహితుల కోసం మాత్రమే పుట్టుకోచ్చిందని.తనవారి కోసం సినిమాల్లో పాటలు రాస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube