ప్రతిపక్షంలో మిత్రపక్షం....!

ప్రతిపక్షంలో చేరిన మిత్రపక్షమా? ఎవరీ మిత్ర పక్షం? మన తెలుగు రాష్ర్టాల్లో కాదులెండి.ఇది కేంద్రానికి సంబంధించిన వ్యవహారం.

భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలో అనేక పార్టీలున్నాయి.అందులో కరడుగట్టిన హిందూత్వ పార్టీ అయిన మహారాష్ర్టకు చెందిన శివసేన ఒకటి.

అది భాజపాతో అప్పుడప్పుడు విభేదిస్తూనే ఉన్నా మొత్తం మీద మిత్ర పక్షంగానే ఉంది.ప్రభుత్వంలో కూడా భాగస్వామిగానే ఉంది.

అలాంటి పార్టీ భూసేకరణ (సవరణ) బిల్లుపై ప్రభుత్వంతో విభేదించింది.ఆ బిల్లును పార్లమెంటు చేత ఆమోదింపచేసి చట్టం చేయాలని మోదీ సర్కారు పట్టుదలగా ఉంది.

Advertisement

అయితే కాంగ్రెసు నేతృత్వంలో ప్రతిపక్షాలన్నీ ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఈ సమావేశాల్లో దాన్ని ప్రతిఘటించేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి.

అందుకు సంబంధించి ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన సమావేశంలో శివసేన చేరింది.నిజంగా ఇది విచిత్రమే.

ప్రతిపక్షాల సమావేశం మంగళవారం ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో జరిగింది.దీనికి శివసేన తరపున ఆనందరావు అడ్సల్‌ హాజరయ్యారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తరపున వెలగపల్లి ప్రసాదరావు హాజరయ్యారు.ఈ భూసేకరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెసు, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం డిమాండ్‌ ఈ సమావేశంలో డిమాండ్‌ చేశాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

అయితే శివసేన బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరడంలేదు.బిల్లుకు చేసిన సవరణల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

Advertisement

ప్రతిపక్షాల సమావేశానికి శివసేన వ వెళ్లడంపై భాజపా ఎలా స్పందిస్తుందో.!.

తాజా వార్తలు