శిల్పా శెట్టి ( Shilpa Shetty ).పరిచయం అవసరం లేని పేరు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ఈమె అనంతరం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికి పలు సినిమాలు వెబ్ సిరీస్ లో మాత్రమే కాకుండా బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కూడా శిల్పా శెట్టి ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈమె ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి రాజ్ కుంద్రా ( Raj Kundra ) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం ఈమె తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఈ విధంగా కెరియర్ లో ఎంతో బిజీగాను వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి శిల్పా శెట్టి తన భర్త నుంచి విడాకులు( Divorce ) తీసుకొని విడిపోతుంది అంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.అయితే ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గతంలో నేను నా భర్తను డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నాను అని చాలామంది భావించారు.
నేను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అనేది పూర్తిగా ఆవాస్తవమని అయితే ఇలాంటి కామెంట్లు చేసేవారు తనని పెళ్లి చేసుకోక ముందు నా ఆర్థిక స్థితిగతులు ఏంటి అనే విషయాలను గుర్తు పెట్టుకోవాలని ఈమె తెలియజేశారు. నా భర్త ధనవంతుడని అందరికీ తెలిసిన విషయమే కానీ నా ఆర్థిక స్థితిని కూడా గూగుల్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారని ఈమె తెలిపారు.

నేను అతడి డబ్బును చూసి ఇష్టపడలేదు.రాజ్ తన చుట్టూ ఉండేవారిపై ఎంతో ప్రేమ చూపిస్తాడు.స్నేహితుల ద్వారా ఏర్పడిన మా పరిచయం ప్రేమగా మారింది.తన స్నేహితులే నాకూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.ఆ విధంగా మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడిందని మేమిద్దరం కలిసి జీవించాలని భగవంతుడు రాసి పెట్టాడు అంటూ ఈ సందర్భంగా ఈమె తన వైవాహిక జీవితం గురించి అలాగే తమ దాంపత్య జీవితం గురించి వస్తున్నటువంటి వార్తలను కూడా పూర్తిగా ఖండిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.