తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై( CM Bhatti Vikramarka ) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు( V.
Hanumantha Rao ) తీవ్ర ఆరోపణలు చేశారు.త్వరలో లోక్ సభ ఎన్నికలు రానుండగా ఖమ్మం నియోజకవర్గం సీటు తనకు రాకుండా చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారని తెలుస్తోంది.
భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే తనకు టికెట్ రాకుండా భట్టి ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదన్నారు.ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు న్యాయం చేయాలని వీహెచ్ కోరారు.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో( Congress party ) బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వీహెచ్ బీసీల ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే తాను తప్పుకుంటానన్నారు.రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పోటీ చేయకపోతే ఖమ్మంలో తనకు అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పారని సమాచారం.







