బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రియాంక చోప్రా ఇటీవలే తాను బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లడానికి గల కారణాన్ని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
బాలీవుడ్‌లో కొందరి రాజకీయాలను తట్టుకోలేకే హాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యాను అంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రియాంక చోప్రా.స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో తనకు అవకాశాలు రాకుండా చేసి ఓ మూలకు నెట్టేయడానికి ఓ గ్రూప్ ఏర్పాటు అయింది అని ఆమె తెలిపింది.
కాగా ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్( Shekar Suman ) ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలలో నిజం ఉంది అని చెబుతూ బాలీవుడ్( Bollywood ) రాజకీయాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమా ఇండస్ట్రీలో కుళ్ళు రాజకీయాలు ఉంటాయి.ఆ రాజకీయాలు మిమ్మల్ని అనిచివేసి అంతం చేసేవరకు వదిలిపెట్టవు.నటుడు హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో కూడా ఇదే జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుమన్.
చాలామంది విషయంలో ఇలాగే జరిగింది.దాన్ని తట్టుకోవాలి, లేదంటే వదిలేయాలి.ప్రియాంక బాలీవుడ్‌ను వదిలి వెళ్లిపోవాలనుకుంది.
నిజంగా తాను మంచి పని చేసింది.హాలీవుడ్‌లో భారత్ తరపునుంచి గ్లోబల్ ఐకాన్‌గా నిలబడింది అని ట్వీట్ చేశాడు.
మరొక ట్వీట్ లో తనకు ఎదురైన అనుభవం గురించి చెబుతూ.సినీ ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు వ్యక్తులు నాకు, నా కొడుకు అధ్యాయన్ కు అవకాశాలు రాకుండా చేశారు.
మాకు వ్యతిరేకంగా పని చేసి ఎన్నో ప్రాజెక్టుల నుంచి తప్పించారు.మమ్మల్ని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూశారు.
ఈ గ్యాంగ్‌స్టర్లు తాచుపాము కంటే కూడా ప్రమాదకరమైనవాళ్లు.కానీ అసలు నిజమేంటంటే వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మమ్మల్ని ఆపలేరు అని రాసుకొచ్చాడు శేఖర్ సుమన్.