తండ్రీ కూతుళ్ల పర్ఫామెన్స్.. నా తల్లి అంటూ ఏడిపించిన శేఖర్ మాస్టర్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు.తన డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లో కూడా కొరియోగ్రాఫర్ గా చేశాడు.సోషల్ మీడియాలో కూడా బాగా ఎనర్జీ గా కనిపిస్తాడు శేఖర్ మాస్టర్.

ఈయన జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, సరైనోడు, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించాడు.అంతేకాకుండా చిన్న హీరోల సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేస్తాడు.

ఇక ఈయన వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా డాన్స్ షో లకు జడ్జిగా బాధ్యతలు చేపట్టాడు.కాగా ఈటీవీలో ప్రసారమైన ఢీ షో లకే జడ్జిగా చేశాడు.

Advertisement
Shekhar-master Emotional Dance Performance With Daughter Sahithi Details, Shekar

ఈయన మొదట్లో ఢీ 2, ఢీ 5 లో డాన్స్ డైరెక్టర్ గా చేశాడు.ఆ తర్వాత జడ్జిగా అడుగు పెట్టాడు.

ఇక జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా జడ్జి గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పలు ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా బాగా సందడి చేస్తున్నాడు.

డ్యాన్స్ లలోనే కాకుండా కామెడీ పరంగా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఇక ఈయన తన కొరియోగ్రఫీ తో ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు.

Shekhar-master Emotional Dance Performance With Daughter Sahithi Details, Shekar

ఈయన తన సోషల్ మీడియా ఖాతాలో కూడా తన డాన్స్ తో బాగా సందడి చేస్తుంటాడు.ఈయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా ఆకట్టుకుంటాడు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

పైగా తన పిల్లలతో కలిసి స్టెప్పులు వేస్తూ బాగా సందడి చేస్తాడు.ముఖ్యంగా తన కూతురు సాహితీ.

Advertisement

తనకంటే బాగా డాన్స్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంది.ఇప్పటికే బుల్లితెరపై కూడా సాహితీ తన డాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సాహితీ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఎక్కువగా డాన్స్ వీడియో లో సందడి చేస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా సాహితి విషయంలో శేఖర్ మాస్టర్ కొన్ని విషయాలు పంచుకుంటూ అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు.

ప్రస్తుతం హోలీ సందర్భంగా ఓ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు స్టార్ మా.అందులో ఈ హోలీకి తగ్గేదే లే అంటూ బాగా సందడి చేశారు సెలబ్రెటీలు.తాజాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రతి ఒక్కరు తమ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నారు.

అందులో శేఖర్ మాస్టర్ కూతురు మరోసారి బుల్లితెరపై అడుగుపెట్టింది.ఇక శేఖర్ మాస్టర్ తన కూతురు తో కలిసి ఓ డాన్స్ పర్ఫామెన్స్ చేశాడు.అలా తండ్రి కూతురు ఇద్దరు డాన్స్ చేయడంతో అక్కడున్న వాళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు.

భాస్కర్ మాస్టర్ సాహితి కి దిష్టి తీసి ఆకట్టుకున్నాడు.ఇక శేఖర్ మాస్టర్ తన కూతురు తన మహాలక్ష్మి అంటూ.

నా ప్రాణం, నా తల్లి, నా అమ్మ.నా సర్వం అంటూ ఏడిపించేసాడు.

ఇక ఈ ప్రోమో లో ఈ తండ్రి కూతురు పర్ఫామెన్స్ బాగా హైలెట్ గా మారింది.

తాజా వార్తలు