అందరి ముందు సుమ పరువు తీసేసిన శేఖర్ మాస్టర్... బిక్క మొహం వేసిన సుమ!

ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శేఖర్ మాస్టర్ ఒకరు.

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క సినిమాలో ఈయన రెండు మూడు పాటలకు పైగా కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ఇక కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక శేఖర్ మాస్టర్ కామెడీ టైమింగ్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి.

అందుకే ఈయన పండగల సమయంలో ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సుమ అడ్డా అనే కార్యక్రమంలో భాగంగా తన స్నేహితుడు జానీ మాస్టర్ తో కలిసి ఈయన హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శేఖర్ మాస్టర్ ఏకంగా సుమపై సెటైర్లు వేస్తూ ఆమె పరువు మొత్తం తీశారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఈమధ్య హీరోయిన్స్ తో కూడా చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేయగా మీరు కూడా హీరోయిన్ కదా అంటూ శేఖర్ మాస్టర్ పంచ్ వేశారు.

Advertisement

అవును అందుకే ఓ సినిమా కూడా చేశాను అంటూ సుమా చెప్పడంతో అవునా? నిజమేనా అంటూ శేఖర్ మాస్టర్ సుమ పరువు తీశారు.

అసలు మీరు నటించిన సినిమా రిలీజ్ అయిందా అంటూ మరోసారి మాట్లాడటంతో ఏమనాలో తెలియక సుమ బిక్క మొహం వేసుకొని అక్కడ ఉన్నటువంటి దిండు తీసుకొని శేఖర్ మాస్టర్ ను కొట్టబోయింది.ఇక సుమ జయమ్మ పంచాయతీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా థియేటర్లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయినా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైమంచి విజయం సొంతం చేసుకుంది.

ఇలా థియేటర్లో ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో శేఖర్ మాస్టర్ సరదాగా సుమని ఆట పట్టించారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు