“ఆమె యూఎస్‌లో( US ) వున్నత ఉద్యోగస్తురాలు… పెళ్లంటే భయపడుతోంది” అనే ఈ మాట వింటే మీకు ఎలా అనిపిస్తోంది? చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది కదూ.అయితే నేటి యువతని, మరీ ముఖ్యంగా అమ్మాయిలను పెళ్ళివిషయమై కదిపితే వారు చాలా భయబ్రాంతులకు గురవుతున్నారని తాజా సర్వేలో వెలువడుతున్న విషయాలు.
ఆమె తండ్రి ఓ ఐపీఎస్, తల్లి పన్నుల శాఖలో ఉన్నతాధికారిణి.ఆమె ఐఐటీ ముంబైలో( IIT Mumbai ) చదివి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ సీట్ సంపాదించి, భారీ ప్యాకేజీతో యూఎస్‌లో పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించింది.
అలా ఆమె దాదాపుగా ఏడేళ్లుగా అమెరికాలోనే నివాసం ఉంటోంది.
ఈమధ్యనే ఆమెకి పెళ్లి సంబంధాలు( Marital relations ) చూస్తున్నారు.అయితే ఆమె పెళ్లి మాట ఎత్తితేనే విరుచుకుపడుతోంది.విషయం బాగా ముదరడంతో కౌన్సిలింగ్ కోసం తండ్రి రిక్వెస్ట్ చేయగా ఆమెని ఓ సైక్రియాటిస్టు కౌన్సిలింగ్ చేయగా ఆమె చెప్పిన విషయాలు విని అతగాడు విస్తుపోయాడట.
విషయం ఏమంటే, ఆమె తనకు చూసిన పెళ్లిళ్ల సంబంధాల సిటింగ్ లో ఎన్నో చేదు అనుభవాలు చూశానని వాపోయింది.ఆమెను చూసిన సో కాల్డ్ వరులు ఆమె ఇస్తామని చెప్పినా, ఎక్కువగా ఎకనామికల్ విషయాలే ఎక్కువ చర్చించేవారట.
పెళ్లయ్యాక ఆమె సంపాదించిన శాలరీ మొత్తం నేరుగా వారి ఖాతాలోనే జమ చేయాలట.అవసరాలకు ఆమె “దేహి ” అంటూ వారిచ్చే చారిటీ కోసం ఎదురు చూడాలా? అని ఆమె ప్రశ్నించింది.భార్య-భర్త, కుటుంబం అనుకున్నాక నీది నాది అనేది ఉండదు.మనది అనుకున్నాక లెక్కలు ఉండవు.నేను ఒప్పుకొంటాను.కానీ పెళ్లి పరిచయాల్లో తొలి సారే అలా మొహమాటం లేకుండా ఫైనాన్సియల్స్ విషయాలు( Financial matters ) మాట్లాడుతున్నారు అని వాపోతోంది.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు… ఆమెని చూడడానికి వెళ్లిన ప్రతిఒక్కరూ ఆ విధంగానే ప్రవర్తించారట.నీతి, నియమం లాంటి మోరల్ ఎథిక్స్ ఒట్టి మాటలు.
అలాంటివి ఈరోజుల్లో మగాళ్ళకి లేదంటూ వాపోయిందట.కాగా ఈ విషయంలో ఆమెకి కౌన్సిలింగ్ జరుగుతోంది.
అయితే ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్?
.