ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ఫలితాలపై సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఫలితాలపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.
నిన్న లేఖ ఎవరు లీక్ చేశారో తనకు తెలియదని చెప్పారు.తమకున్న అభ్యంతరాలపై పార్టీ అధిష్టానం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని తెలిపారు.
అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్ పై మల్లికార్జున ఖర్గే భారీ ఆధిక్యతతో విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఖర్గేకు 7897 ఓట్లు రాగా, శశిథరూర్ కు 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి.
అయితే అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని శశిథరూర్ ఆరోపించారు.ఉత్తర్ ప్రదేశ్ లో పోలైన ఓట్లు ఓట్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ.
పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.