పాదయాత్ర పనుల్లో షర్మిల ! పట్టించుకునే వారే కరువు ? 

వైఎస్ షర్మిల తెలంగాణలోని చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే షర్మిల పూర్తి చేసుకున్నారు.రేపటి నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

ఈ మేరకు ఈ రోజు ఏపీలోని ఇడుపులపాయలో ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు.తెలంగాణలో 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించే విధంగా షర్మిల ప్లాన్ చేసుకున్నారు.

అసలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని ప్రకటించే సమయంలోనే వంద రోజుల్లో పాదయాత్ర ప్రారంభిస్తానని షర్మిల ప్రకటించారు.అలా ప్రకటించి నేటికి వంద రోజులు అవుతుంది.దీంతో రేపటి నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కాబోతోంది.2012లో ను ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల 3112 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.        ఇక ఇప్పుడు చేపట్టబోయే పాదయాత్రపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే షర్మిల పార్టీకి, ఆమె నిర్వహించబోయే పాదయాత్రకు ఆశించిన స్థాయిలో మీడియా, సోషల్ మీడియా లో ప్రాధాన్యం దక్కకపోవడం పెద్ద ఇబ్బందికరంగా మారింది.మీడియాలో రాకపోయినా సోషల్ మీడియా ద్వారా అయినా ఆ హైప్ ను క్రియేట్ చేసుకునేందుకు షర్మిల పార్టీ ముందు నుంచి ప్రయత్నాలు చేపట్టకపోవడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

Advertisement

షర్మిల పాదయాత్ర ద్వారా ఎంతగా మైలేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నించినా, ప్రజల్లోకి ఆమె పాదయాత్ర ఎఫెక్ట్ వెళ్ళాలి అంటే తప్పనిసరిగా మీడియా సోషల్ మీడియా ఆధారం అవుతుంది.కానీ ఈ విషయాలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు ఈ పాదయాత్రకు హైప్ వచ్చే విషయంలో సందిగ్ధత నెలకొంది.   

 ఈ పాదయాత్ర ద్వారా తమ పార్టీకి మైలేజ్ పెంచాలని, పెద్దఎత్తున నాయకులను చేర్చుకోవడం తో పాటు,  తెలంగాణ ప్రజల్లోనూ తమ పార్టీపై ఆదరణ పెరిగేలా చేసుకోవాలని షర్మిల భావిస్తున్నారు.కానీ మీడియా మద్దతు పెద్దగా దక్కకపోవడంతో ఆమె సైతం ఆందోళనలోనే ఉన్నారు. .

Advertisement

తాజా వార్తలు