ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు.ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) చెందిన నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
గురువారం ఏలూరులో( Eluru ) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు.
బీజేపీ పార్టీతో( BJP ) పొత్తులు పెట్టుకున్న పెట్టుకోకపోయినా టీడీపీ, వైసీపీ పార్టీలు బీజేపీకి బానిసలు.బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కొత్త నిర్వచనం చెప్పారు.
వచ్చే ఎన్నికలలో ప్రజలు వైసీపీ,( YCP ) టీడీపీ,( TDP ) జనసేన( Janasena ) పార్టీలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీకి బానిసలు చేయాలని చూస్తున్నాయి.కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో సైన్యం లాగా మారాలి. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కష్టపడతారో అంత కష్టపడి పనిచేయాలి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ నెరవేరుతాయి అని తెలియజేయాలి.అప్పుడు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది.
ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లి వాళ్లకి వివరించి చెప్పాలి అని షర్మిల ఏలూరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల సమావేశంలో తెలియజేశారు.