తెలంగాణలో షర్మిల పాదయాత్ర.. అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి ప్రారంభం

ప్రజా ప్రస్థానం పేరుతో అక్టోబర్ 20 నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టనున్నారని పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభమైన రాష్ట్ర వ్యప్తంగా పాదయాత్ర పూర్తి అయిన తర్వాత అక్కడే ముగుస్తుందని స్పష్టం చేశారు.ఈ మేరకు ఆమె సోమవారం లోటస్ పాండ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలోఏ మాట్లాడారు.

 Sharmila Padayatra In Telangana .. Starting From Chevella On October 20, Ts Polt-TeluguStop.com

పాదయాత్ర .ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశంపై కొనసాగుతుందని.ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పాదయాత్ర అని చెప్పారు.కాగా తెరాస భాజపా, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని అర్థమయ్యేలా జనానికి వివరిస్తామన్నారు.జీహెచ్ఎంసీ మినహా మిగతా 90 నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర సాగుతుందని రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు.పాదయాత్ర సుమారు ఏడాది పాటు కొనసాగుతుందని ఈ సమయం మొత్తం రోడ్ల పైనే ఉంటామని తెలిపారు.

యాత్రలో ప్రతి  పల్లెకు వెళ్తామని ప్రతి గడపను తడతామని చెప్పారు.బిజేపి, కాంగ్రెస్ తెరాసకు ఎలా అమ్ముడుపోయాయి ప్రజలకు వివరిస్తామని, కుటుంబ ప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ఏవిధంగా బ్రష్టు పట్టించారనే అంశాలను సైతం ప్రజలకు తెలుపుతామని, దీంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

పాద యత్రలకు వైయస్సార్ ఏ బ్రాండ్ అంబాసిడర్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నుంచే జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పాలన ఆవిష్కరించాయన్నారు.వైయస్ స్ఫూర్తితో మేము ప్రజాప్రస్థానం చేయబోతున్నామని షర్మిల పేర్కొన్నారు.పాదయాత్రలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొస్తామని ప్రజలకు భరోసా ఇస్తామని చెప్పారు కాగా పాదయాత్రలో మంగళవారం నిరుద్యోగ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube