ఏపీ రాజకీయాల్లో షర్మిల దూకుడుగా వెళ్తున్నారు..: ఆనం

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల దూకుడుగా వెళ్తున్నారని తెలిపారు.


సీఎం జగన్( CM Jagan ) పై షర్మిల చేస్తున్న విమర్శలు జనంలోకి వెళ్తున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.ఈసారి ఎన్నికల్లో షర్మిల ప్రభావం కనిపించకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం బలపడుతుందని తెలిపారు.ఐదేళ్లపాటు షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా ఉంచితే కాంగ్రెస్ ( Congress )బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే 2029లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్, హస్తం గుర్తు, ఇందిరమ్మను ప్రజలు పూర్తిగా మరిచి పోలేదని చెప్పారు.అలాగే తమపై అనర్హత వేటు వేసే అంశంలో స్పీకర్ కు సజ్జల ఫోన్ చేసి డైరెక్షన్ ఇస్తున్నారని ఆరోపించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు