రాజకీయ లబ్ది కోసమే జగన్ పై షర్మిల నిందలు..: కొడాలి నాని

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని( Ex Minister Kodali Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్ పై( Jagan ) షర్మిల( YS Sharmila ) నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని కొడాలి నాని తెలిపారు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్( Congress Party ) కోసం పాకులాడటం సరికాదని చెప్పారు.

తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల ఇప్పుడు ఏపీలోనూ అదే పని చేస్తోన్నారని విమర్శించారు.షర్మిల పాదయాత్ర చేసిన 2014 ఎన్నికల్లో వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు.ఓటమి తరువాత షర్మిల ఎక్కడైనా కనిపించిందా అని ప్రశ్నించారు.

ఏపీలో ఏం జరుగుతుందో షర్మిలకు కనీస అవగాహన లేదని చెప్పారు.ఏపీలో కాంగ్రెస్ కు ప్రతిపక్షం హోదా కూడా వచ్చే అవకాశం లేదని తెలిపారు.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు