షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) పరిచయం అవసరం లేని పేరు యూట్యూబర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం ద్వారా కూడా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు.అయితే ఈ కార్యక్రమంలో ఈయన మంచి గుర్తింపు కన్నా భారీ స్థాయిలో నెగిటివిటీ మూట కట్టుకున్నారు.
దీంతో ఈయన ప్రేమకు కాస్త బ్రేకప్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాలి.బిగ్ బాస్ కి వెళ్లకముందు నటి దీప్తి సునయనతో( Deepthi Sunaina ) పీకల్లోతో ప్రేమలో ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మరొక కంటెస్టెంట్ సిరి హనుమంతు తో చాలా చనువుగా ఉన్నారు.
ఇలా వీరిద్దరి ప్రవర్తన ప్రేక్షకులకు చిరాకు తెప్పించడమే కాకుండా దీప్తి సునయన కూడా చివరికి తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పింది అయితే షన్ను కూడా నటి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) బ్రేకప్ కు కారణమయ్యారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బేబీ సినిమాకు హీరోయిన్ కాకముందు వైష్ణవి చైతన్య పలు వెబ్ సిరీస్ లలో అలాగే యూట్యూబ్ వీడియోలు కవర్ సాంగ్స్ చేస్తూ ఉండేవారు ఇక పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా ఈమె చేశారు.
ఇలా వెబ్ సిరీస్ లు చేయకముందు షార్ట్ ఫిలిమ్స్ అలాగే డబ్స్మాష్ వీడియోలు చేసే సమయంలో తనకు బిగ్ బాస్ కంటెస్టెంట్ మహబూబ్ దిల్ సే తో(Mehaboob Dilse) ఎంతో చనువు పెరిగింది.ఈ విధంగా వీరిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఏర్పడటంతో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి.వైష్ణవి కోసం ఒక ఎమ్మెన్సీ కంపెనీలో కూడా తనకు ఆఫర్ కలిగేలా చేశారట మహబూబ్ ఇలా వీరిద్దరూ ఎంతో మంచి సాన్నిహిత్యంతో ప్రేమతో ఉండగా అదే సమయంలోనే ఈమె షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని వెబ్ సిరీస్ చేశారట.
ఈ వెబ్ సిరీస్ సమయంలో పెరగడంతో మహబూబ్ వైష్ణవి చైతన్యకు బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది.ఈ విధంగా వైష్ణవి చైతన్య మహబూబ్ లవ్ బ్రేకప్ కావడానికి షణ్ముఖ్ జస్వంత్ కారణమంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.వైష్ణవి చైతన్య ఈ వెబ్ సిరీస్ లలో నటించడం వల్ల తనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి వైష్ణవి చైతన్య అనంతరం బేబీ సినిమా(Baby Movie) లో హీరోయిన్గా అవకాశం అందుకున్నారు.ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.