నాలుగు దశాబ్దాల మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.అలాగే ఫ్లాప్ మరియు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
కానీ రీసెంట్ గా విడుదలైన ‘భోళా శంకర్’( Bholaa Shankar ) లాంటి ఘోరమైన, అవమానకరమైన డిజాస్టర్ ఫ్లాప్ మాత్రం ఆయన కెరీర్ లో లేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ ఏడాది ప్రారంభం లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ( Waltair Veerayya Movie )దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధిస్తే, భోళా శంకర్ సినిమా కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేక చతికిల పడింది.
ఈ సినిమాకి కొన్ని ప్రాంతాలలో వచ్చిన దారుణమైన వసూళ్లు మన చిన్న తనం లో ఉన్నప్పుడు విడుదలైన మెగాస్టార్ చిరంజీవి అతి పెద్ద ఫ్లాప్ చిత్రం ‘మృగరాజు’ కి కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఉదాహరణకి హైదరాబాద్ లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్ మొత్తం కలిపి ఈ సినిమాకి క్లోసింగ్ లో కేవలం 27 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.మృగరాజు చిత్రానికి ఈ ప్రాంతం లో 44 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇక అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది.
విశ్లేషకుల అంచనా ఏమిటంటే ఈ సినిమాని కనీసం మెగాస్టర్ చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా చూసి ఉండరు అని.అలాంటి చిత్రాన్ని ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు.తెలుగు తో పాటుగా హిందీ, తమిళం , మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యగా ఆరంభం నుండే అదిరిపోయే రేంజ్ వ్యూస్ వచ్చాయి.సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చలు.
థియేటర్స్ లో అంత పెద్ద ఫ్లాప్ అయిన ఈ చిత్రానికి ఓటీటీ లో ఈ రేంజ్ క్రేజ్ రావడానికి కారణం ఈ సినిమాని ఎవరూ ఇప్పటి వరకు చూడలేదు కాబట్టే.

ఓటీటీ లో ఈ చిత్రాన్ని అందరూ బాగానే చూస్తున్నారు కానీ, చూసిన ప్రతీ ఒక్కరు డైరెక్టర్ మెహర్ రమేష్ ( Meher Ramesh )ని బాండ బూతులు తిడుతున్నారు.ఇంత చెత్త క్వాలిటీ తో మెగాస్టార్ సినిమా ఎలా తీసావు రా అంటూ అతనిని ట్యాగ్ చేసి కుళ్ళపొడుస్తున్నారు.ఈ సినిమా తమిళం లో అజిత్ హీరో గా నటించిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ అనే సంగతి అందరికీ తెలిసిందే.
ఆ సినిమాకి కూడా అప్పట్లో పెద్దగా టాక్ ఏమి రాలేదు.కానీ అందులో నాలుగు సన్నివేశాల్లో అజిత్ తన నట విశ్వరూపం చూపించడం తో సినిమా వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.
కానీ ఇక్కడ మాత్రం చిరంజీవి ని అంత పవర్ ఫుల్ గా చూపించడం లో విఫలం అయ్యాడు డైరెక్టర్ మెహర్ రమేష్( Meher Ramesh ).మంచో చెడో ఓటీటీ లో మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇది ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.







