రాజ్ తరుణ్ కి జోడీగా షాలిని పాండే  

Shalini Pandey Romance With Raj Tarun In Tollywood -

టాలీవుడ్ కి ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలో వరుసగా మూడు సక్సెస్ లతో మంచి ఊపు మీద కనిపించిన ఈ కుర్రహీరో తర్వాత ఊహించని విధంగా వరుస ప్లాపులు సొంతం చేసుకున్నాడు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Shalini Pandey Romance With Raj Tarun In Tollywood

ఇప్పుడు రాష్ట్రాన్ని పరిస్థితి కూడా అలాగే ఉంది.వరుస ఫ్లాపులతో క్రిందకు పడిపోయిన ఈ హీరోతో ఎవరు కూడా సినిమా తెరకెక్కించడానికి ముందుకు రావడం లేదు.

అయితే ఊహించని విధంగా తన బ్యానర్లో దిల్ రాజు రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు.

ఇద్దరి లోకం ఒకటే అనే టైటిల్ తో జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది.

ఇదిలా ఉంటే సినిమాల్లో ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తుందని మొదట వినిపించిన, తాజాగా ఈ సినిమాలో తనకు జోడీగా అర్జున్ రెడ్డి బ్యూటీ శాలిని పాండే హీరోయిన్ ఇంకా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.త్వరలో సెట్స్ పైకి వెళ్ళిపోతున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ స్వరాలు అందిస్తుండగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ గా పని చేస్తున్నట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shalini Pandey Romance With Raj Tarun In Tollywood- Related....