దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించినటువంటి వారిలో నటి షకీలా( Shakeela ) ఒకరు.ఈమె ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా మరికొన్ని సినిమాలలో శృంగార తారక నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా షకీలా శృంగార తారగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన అనంతరం పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వచ్చాయి ఇక ఈమె సినిమాలను చూడటానికి ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చేవారు అంతలా ఈమె ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు అయితే క్రమక్రమంగా ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.
ఈ విధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి షకీలా పలు బుల్లితెర కార్యక్రమాలు రియాలిటీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగు బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈమె పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ కార్యక్రమానికి రాకముందు షకీలా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎవరికీ తెలియనటువంటి కొన్ని రహస్యాలను బయటపెట్టారు.ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు ఒక లవర్ ఉండేవారని తన లవ్ స్టోరీ గురించి తెలిపారు.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తాను ఒక వ్యక్తిని ప్రేమించానని ఆ వ్యక్తి కారణంగా తాను ప్రెగ్నెంట్ ( Pregnant )అయ్యానని తెలిపారు అయితే అప్పట్లో నాకు పీరియడ్స్ నెల నెల సక్రమంగా రాకపోవడంతో తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయానని అయితే నా కడుపు పెరగడంతో అనుమానం వచ్చిన మా అమ్మ నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా డాక్టర్ నేను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయట పెట్టారు.అప్పటివరకు నాకు ప్రెగ్నెంట్ అనే విషయం కూడా తెలియదని తెలిపారు.నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో మా అమ్మ అబార్షన్ చేయించిందని షకీలా ఈ సందర్భంగా తెలియజేశారు.నేను ప్రెగ్నెంట్ అయిన సమయంలో బిడ్డను కనే వయసు నాది కాదని ఒకవేళ బిడ్డ పుట్టిన లోపాలతోనే పుడుతుందన్న ఉద్దేశంతోనే నా తల్లి అబార్షన్ చేయించిందని ఈమె తెలియజేశారు.
అయితే ఇప్పటికీ తన లవర్ తో తనకు రిలేషన్ ఉంది అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.