యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తీ ఒకరు.ఈయన చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతాయి.
అందుకే ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.ఆవారా సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
అప్పటి నుండి కార్తీ సినిమా హిట్ టాక్ వస్తే ఇక్కడ కూడా మంచి వసూళ్లే రాబడుతాయి.
ఇక కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేసాడు.
నాగార్జునతో కలిసి ఊపిరి సినిమా చేసాడు.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
ఇక ఈ మద్యే విరుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ లో కూడా నటించి మెప్పించాడు.
ఇక ఇప్పుడు మరో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.కార్తీ సర్దార్’సినిమాను చేస్తున్నాడు.
ఈసారి కూడా కార్తీ ఒక విభిన్న కథతో రాబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, సాంగ్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి.అయితే ఈ సినిమా షారుఖ్ ఖాన్ చేసే జవాన్ సినిమా ఒకే కథాంశంతో రూపొందుతున్నాయి అంటూ కోలీవుడ్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది.ప్రెజెంట్ షారుఖ్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో షారుఖ్ కు జోడీగా నయనతార నటిస్తుంది.
సర్దార్, జవాన్ సినిమాలు రెండు ఒకే కథతో తెరకెక్కుతున్నాయి అని అంటున్నారు.
మరి రెండు సినిమా కథలు ఒకటే అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అసలే షారుఖ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
మరి రెండు ఒకటే కథలు అయితే బెడిసి కొట్టే అవకాశం ఉంది.మరి కార్తీ ఈ దీపావళికే రాబోతున్నాడు కాబట్టి సేఫ్ జోన్ లోనే ఉండే అవకాశం ఉంది.

ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతుంది.చూడాలి సర్దార్ సినిమాతో ఎలా ఆకట్టు కుంటాడో.