సామ్ బర్త్ డే స్పెషల్.. వరుస అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈ రోజు పుట్టిన రోజును జరుపు కుంటుంది.దీంతో ఈమెకు అభిమానులు, సినీ సెలెబ్రిటీలు వరుసగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 Shaakuntalam Team Drops New Poster On Samantha's B'day, Happy Birthday Samantha,-TeluguStop.com

సోషల్ మీడియాలో ఈ రోజు సామ్ పుట్టిన రోజు సందడి కనిపిస్తుంది.ఈమె ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.

సామ్ స్పీడ్ చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు.

ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు వరుస వెకేషన్స్ కు వెళ్తూ క్షణం కూడా కాళీ లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది.తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన అవకాశం అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.ఇక సమంత వెకేషన్ కోసం ఆమె సోదరితో కలిసి థాయిలాండ్ కు వెళ్లి నిన్ననే ఇండియాకు తిరిగి వచ్చింది.

ఈ రోజు ఈమె పుట్టిన రోజు సందర్భంగా ఈమె నటించిన సినిమాల నుండి స్పెషల్ అప్డేట్ లు వస్తున్నాయి.ఇప్పటికే సామ్ నటించిన కాతు వాకుల రెండు కాదల్ ఈ రోజు ఈమె పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఈమె నటించిన శాకుంతలం సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Telugu Happy Samantha, Hbd Samantha, Kaathuvaakula, Nayanatara, Samantha, Shaaku

ఆ పోస్టర్ లో సమంత ఏంజెల్ లా మెరిసి పోతుంది.తెలుపువర్ణం కలిగిన దుస్తుల్లో మల్లె పూలు పెట్టుకుని అందంగా కనిపిస్తుంది.మేకర్స్ అయితే పోస్టర్ తోనే సరిపెట్టడంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందారు.

ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే అల్లు అర్జున్ కుమార్తె బాల నటిగా పరిచయం అవుతుంది.

చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube