ఆ హీరోతో లీడర్-2 సినిమా.. మరి రానా పరిస్థితి ఏంటి?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ దర్శకులలో ఒకరిగా దూసుకుపోతున్నాడు.

 Sekhar Kammula Planning Leader Sequel Surya Shekar Kammula, Leader 2 Movie, Rana-TeluguStop.com

అంతే కాకుండా టాలీవుడ్ లో ఎంతోమంది దర్శకులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు శేఖర్ కమ్ముల.ఎక్కువగా క్లాసిక్ సినిమాలు తీస్తూ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు.

ఇకపోతే ఇటీవలే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా తో హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినీమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన ల వర్షం కురిపించిన సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే శేఖర్ కమ్ముల కెరియర్ లో తీసిన బెస్ట్ సినిమాలలో లీడర్ సినిమా కూడా ఒకటి.

రానా దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇక అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్‌ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆడియెన్స్‌ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్శకుడు శేఖర్‌ కమ్ముల కూడా గతంలో లీడర్ సినిమాకు సీక్వెల్‌ తప్పకుండా ఉంటుందని వెల్లడించిన విషయం విధితమే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సీనిమా సీక్వెల్‌ పై ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

Telugu Rana, Shekar Kammula, Suriya, Tollywood-Movie

తమిళ స్టార్‌ హీరో సూర్య లీడర్‌ 2 సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిస్తున్నాయి.పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కెనున్న ఈ చిత్రానికి సూర్య పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది.అయితే అందరు లీడర్ సినిమా సీక్రెట్ 2 లో కూడా రానా ఉంటారు అనుకున్నారు.కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం ఈ సినిమాలో హీరోగా సూర్య ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube