విమానాయానం అనేది ఇక్కడ ప్రతి ఒక్కడి కల.కానీ అది ఒక సామాన్యుడికి కేవలం ఒక కలలాగే మిగిలిపోతూ ఉంటుంది.
ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు తక్కువ ధరలకు టికెట్స్ విక్రయిస్తూ ఉంటాయి.అయితే ఆ ఆఫర్లు మాత్రం పరిమిత కాలం మాత్రమే ఉంటాయి.
అయితే ఆ సమయంలో జనాలను ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.ఐతే విమానయాన సంస్థ ( Airline )స్కూట్స్ మన దేశంలోని వివిధ పట్టణాల నుంచి ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని 17 గమ్యస్థానాలకు భారీగా తగ్గింపు ధరలతో బుకింగ్స్ ప్రారంభించిందనే విషయం మీకు తెలుసా.

అవును, ఈ నెల 16 నుంచి 20 వ తేదీ మధ్యలో టికెట్స్‌ను బుక్ చేసుకోవచ్చని స్కూట్ ఎయిర్‌లైన్స్( Scoot Airlines ) తాజాగా ప్రకటించింది.మన దేశంలోని కోయంబత్తూర్, అమృత్‌సర్, తిరువునంత పురం, విశాఖపట్నం, తిరుచిరాపల్లి, నుంచి ఈ సర్వీస్‌లు నడుస్తాయని తెలుస్తోంది.ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకున్న వారు 2023 ఆగస్టు 31 వరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చని కూడా తెలిపింది.

ఇకపోతే, ఈ 17 ప్రాంతాలకు వివిధ ప్రాంతాలనుండి ఛార్జీలు 6,200 రూపాయల నుంచి మొదలవుతాయి.ఇండోనేషియా, లావోస్, జపాన్, మలేషియా( Indonesia, Laos, Japan, Malaysia ), సింగపూర్, దక్షిణ కొరియా, పిలిప్పీన్స్, వియత్నాంతో పాటు స్కూట్ నెట్‌వర్క్‌లోని వివిధ గమ్యస్థానాలకు ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.సింగపూర్ ద్వారా వెళ్లే ఇతర దేశాల ప్రాంతాలకు కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపింది.
కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని చెబుతున్నారు.







