తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంతగా హాట్ టాపిక్ గా మారిందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.ఇప్పుడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పూర్తి స్థాయిలో గెలుపుపై అంతేకాక గెలుపు అవకాశాలను పెంపొందించుట మీద దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది.
ఇక అక్టోబర్ 30 న పోలింగ్ జరగనున్న తరుణంలో ఎన్నికల కమిషన్ విజయవంతంగా ఎన్నిక నిర్వహణపై దృష్టి పెట్టింది.అయితే హుజూరాబాద్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఇక దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారు పెద్ద ఎత్తున ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పటికీ హుజూరాబాద్ ఫలితంపై ఎవరికి ఖచ్చితమైన అవగాహన రానటువంటి పరిస్థితి ఉంది.ఓటర్లు గంభీరంగా ఉండటంతో ఫలితంపై ఎవరూ ఖచ్చితమైన అవగాహనకి రావడం లేదు.

అయితే పలు సర్వేలు టీఆర్ఎస్ కు గెలిచే అవకాశం ఉందని చెబుతుండగా, పలు సర్వేలు బీజేపీ కి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.అయితే సోషల్ మీడియా పార్టీల ప్రలోభాల పర్వంపై పలు వీడియోలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది.ఒకవేళ ఓటింగ్ వరకు తమ పార్టీకి మద్దతిచ్చే వారిని తరలించడంపై ఇప్పుడు అన్ని పార్టీలు దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది.అయితే సైలెంట్ ఓటింగ్ జరుగుతుందనే భావన కొందరిలో వ్యక్తమవుతోంది.
ఒకవేళ సైలెంట్ ఓటింగ్ జరిగితే వారి ఓట్లు ఎవరికి పడతాయనేది ఇప్పుడు పార్టీలకు టెన్షన్ గా మారింది.అందుకే తమ తమ పార్టీల వారసత్వ ఓటు బ్యాంకును కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా హుజూరాబాద్ లో గెలిచే పార్టీకి మాత్రం రానున్న రోజులలో చాలా వరకు రాజకీయంగా లాభం జరిగే అవకాశం ఉంది.మరి ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది చూడాల్సి ఉంది.