కేజిఎఫ్ హీరోని చంపేందుకు వచ్చిన సీరియల్ కిల్లర్ ఎంకౌంటర్...

2018 సంవత్సరంలో కన్నడలో కేజిఎఫ్ చిత్రం సృష్టించినటువంటి సంచలనం అంతా ఇంతా కాదు.ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చిన ఈ చిత్రం ఒక కన్నడ లోనే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా పలు రికార్డులను తిరగరాసింది.

 Serial Kiler Bharath Murder Encounter In Karnataka-TeluguStop.com

దీంతో ఈ చిత్రంలో నటించినటువంటి హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నేను దర్శకత్వం వహించాడు.

అయితే తాజాగా హీరో యష్ కి సంబంధించినటువంటి వార్త నెట్టింట్లి బాగానే వైరల్ అవుతోంది.

అప్పట్లో హీరో యాష్ ని చంపేందుకు కొందరు పన్నాగం పన్నారు.

ఇందులో భాగంగా భరత్ అనే సీరియల్ కిల్లర్ ని కూడా నియమించారు.అయితే ముందుగానే ఈ విషయాన్నీ పసిగట్టిన కొందరు ప్లాన్ ని పటాపంచలు చేశారు.

దీంతో భరత్ పోలీసులకు చిక్కకుండా అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.అంతేగసాక భరత్ అప్పటికే పలు హత్యా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

 తాజాగా పోలీసులు భరత్ ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించి అరెస్టు చేశారు.అంతేగాక భరత్ ని బెంగళూరుకి తీసుకొచ్చి రీ కన్స్ట్రక్షన్ అనే పేరుతో ఆధారాలు సేకరిస్తున్న సమయంలో నిందితుడు భరత్ తప్పించుకునే యత్నం చేస్తూ పోలీసులపై కాల్పులు జరిపాడు.

దీంతో చేసేదేమీ లేక పోలీసులు అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు.

Telugu Bharath, Bharath Latest, Kananda Kgf, Kgf Chapter, Kgf Yash-Movie

అయితే కన్నడ హీరో యాష్ మాత్రం ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు.మొదటి కేజీఎఫ్ చాప్టర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో దర్శకుడు రెండవ భాగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు.ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

దీంతో కేజిఎఫ్ చాప్టర్ 2 ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube