హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం

హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి) Kothakota Srinivas Reddy ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

మొత్తం 86 మందిని బదిలీ చేస్తూ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డుల వరకు అందరినీ ఏఆర్ కు సీపీ అటాచ్ చేశారు.

బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.అలాగే ఇప్పటికే వివిధ స్టేషన్ల నుండి పంజాగుట్ట పోలీస్ స్టేషన్( Panjagutta PS ) కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు