మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తన ఓటమిని ఒప్పుకోవడం లేదు.ఈ మేరకు తనకు ఓటు వేసిన వారి బూత్ నెంబర్లను అడిగారు.
ఆ పోలింగ్ కేంద్రాల్లో తనకు పడ్డ ఓటు ఏమైందని ప్రశ్నిస్తున్నారు.తనకు పడ్డ ఓట్లన్నీ టీఆర్ఎస్, బీజేపీకి డైవర్ట్ అయ్యాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో పోలింగ్ లో అవకతవకలు జరిగాయంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్ ఏజెంట్లు, నేతలు తమ సింబల్ అయిన కార్లలో రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
కార్లలో టీఆర్ఎస్ నేతలను ఎందుకు అనుమతించారని ఈసీని ప్రశ్నించారు.ఈ మేరకు మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు.







